Tollywood | టాలీవుడ్లో సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా స్టార్ హీరోల భారీ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డుల సందడి గుర్తుకు వస్తాయి. అయితే 2026 మే నెల మాత్రం పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈసారి పెద్ద స్టార్ల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో ఒక రకమైన ‘స్టార్ వాక్యూమ్’ కనిపిస్తోంది. కానీ ఇదే పరిస్థితి చిన్న, మిడ్‌రేంజ్ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. సమ్మర్ హాలిడే సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ కోసం స్టార్ పవర్ లేకపోయినా, ఒకసారి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్‌ను నిలబెట్టుకునే అవకాశం ఈ సినిమాలకు ఉంది. అందుకే ఈసారి సక్సెస్ పూర్తిగా కంటెంట్ చేతుల్లోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
గతంలో స్టార్ ఇమేజ్ ఒక సినిమాను కనీసం మొదటి వీకెండ్ వరకైనా లాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా, రివ్యూల ప్రభావంతో వర్డ్ ఆఫ్ మౌత్ కీలకంగా మారింది. మంచి కథ, బలమైన భావోద్వేగాలు, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఉంటే స్టార్ లేకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ఇటీవల వచ్చిన పలు సినిమాలు నిరూపించాయి. ఈ మేలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్న అంశం ‘కంబ్యాక్ స్టోరీస్’. సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఆమెకు సాధారణ రిలీజ్ కాదు.. ఒక రీడెఫినిషన్. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా అడుగు పెడుతున్న సమంతకు ఇది ఒక భారీ ఛాలెంజ్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆమె కెరీర్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.
మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ పరిస్థితి కూడా కీలక దశలోనే ఉంది. ‘కార్తికేయ 2’ తర్వాత వచ్చిన ఫ్లాప్స్ అతని మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. ఇప్పుడు ‘స్వయంభు’ వంటి భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌తో వస్తున్న నిఖిల్‌కు ఇది డూ ఆర్ డై పరిస్థితి. భారీ బడ్జెట్, విభిన్న కథాంశం ఈ సినిమాను సక్సెస్ చేస్తే అతని కెరీర్ మరో స్థాయికి చేరుకోగలదు. లేకపోతే మరింత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన యాక్టర్‌గా మాత్రం ఇంకా తన స్థానం కోసం పోరాడుతున్నారు. ‘గాయపడ్ద సింహం’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ చిత్రం అతనికి నటుడిగా సర్వైవల్ టెస్ట్‌గా మారింది. మొత్తానికి, టాలీవుడ్ సమ్మర్ 2026 ఒక కీలక పరీక్షగా నిలుస్తోంది. స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే సినిమాలు ఎలా నిలబడతాయో, అలాగే ముఖ్య నటుల కెరీర్లు ఎలా మలుపుతీసుకుంటాయో ఈ సీజన్ నిర్ణయించనుంది.