Vamsee Interview | టైగర్ నాగేశ్వర రావు దోపిడీల గురించి ముందే చెప్పేవాడు.. డైరెక్టర్ వంశీ ఇంటర్వ్యూ
Vamsee Interview | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు డైరెక్టర్ వంశీ. టైగర్ నాగేశ్వర రావు విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
Vamsee Interview | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా వస్తోన్న ఈ చిత్రాన్ని వంశీ (Vamsee) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తుంది. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు డైరెక్టర్ వంశీ. టైగర్ నాగేశ్వర రావు విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
టైగర్ నాగేశ్వర రావుపై సినిమా చేయడానికి కారణం..?
ఫిల్మ్ మేకర్స్ కమర్షియల్ సినిమాలు చేయాల్సిన అవసరముంది. అంతేకాదు ఏ డైరెక్టరైనా బయోపిక్ చేయాలనుకుంటాడు. చాలా కాలం నుంచి బయోపిక్ చేయాలని ప్లాన్ చేసుకున్నా. బిగ్ స్క్రీన్‌పై ఎవరి కథను చూపిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు టైగర్ నాగేశ్వర రావు నాకు గుర్తుకు వచ్చాడు. డైరెక్టర్లు సాధారణంగా సినిమా స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ వేత్తల బయోపిక్స్ తీస్తుంటారు. కానీ నేను మాత్రం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా. టైగర్ నాగేశ్వర రావు గురించి తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయా.
సినిమా కోసం రీసెర్చ్ చేయడం ఎలా అనిపించింది..?
స్టూవర్ట్‌పురం వెళ్లి.. స్థానిక ప్రజలను కలిశా. టైగర్ నాగేశ్వర రావు భార్య, సోదరుడు, పోలీస్ అధికారులతోపాటు ఇతర వ్యక్తులతో మాట్లాడాను. అతడి గురించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. అందుకే ఈ సినిమా వాస్తవ పుకార్ల ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పా. టైగర్ నాగేశ్వర రావు తను చేసే దోపిడీల గురించి ముందే చెప్పేవాడు. ఈ కథను కన్విన్స్‌గా చెప్పడమే నాకు పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది.
మీ బిగ్గెస్ట్ సినిమా ఇది.. ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేశారు..?
నాపై అలాంటి ఒత్తిడేమీ లేదు. నా తొలి సినిమా విజిటింగ్ కార్డులాంటిది. డైరెక్టర్‌ను పూర్తిగా విశ్వసించే రవితేజ, అభిషేక్ అగర్వాల్ లాంటి వ్యక్తులున్నప్పుడు బాధపడాల్సిన పని లేదు. నటీనటుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నా. జిసు సేన్ గుప్తా, హరీష్ పేరడిన కొత్తగా చూపించడం జరిగింది.
ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమాకు ప్రయత్నించారు.. మీరెలా చూశారు..?
అవును.. కొంతమంది కూడా ప్రయత్నించారు. కానీ ఇతరుల గురించి నేను ఆలోచించలేదు. నా వెర్షన్‌పై మాత్రమే ఫోకస్ పెట్టా. చాలా బాగా శోధించా. కథను చాలా కమిట్మెంట్తో చెప్పా.
సినిమాకు సుదీర్ఘమైన రన్‌టైమ్ ఉందని మీరు అనుకోలేదా..?
లెంగ్తీ రన్ టైం ఉన్న తొలి సినిమా ఇదేనా..? సినిమా యావరేజ్ నిడివి ఎంత..? ఆర్ఆర్ఆర్ రన్‌టైం ఎంత.? రన్‌టైం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది బయోపిక్.. కొన్ని విషయాలు వివరంగా చెప్పాల్సి ఉంటుంది. కమర్షియల్ సినిమా తీయాలనుకున్నప్పుడు లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

