Thunivu Movie | తునివు సినిమాతో అరుదైన రికార్డు సాధించిన అజిత్..!
చాలా కాలం తర్వాత అజిత్ 'తునివు' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నువ్వా నేనా అంటూ విజయ్‌తో సాగిన పోరులో అజిత్ తొలి విన్నర్‌గా నిలిచాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది
Ajith Kumar | చాలా కాలం తర్వాత అజిత్ ‘తునివు’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నువ్వా నేనా అంటూ విజయ్‌తో సాగిన పోరులో అజిత్ తొలి విన్నర్‌గా నిలిచాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో వచ్చాయి. పోటీగా తనకంటే అధిక మార్కెట్ కలిగిన విజయ్ ఉన్నా.. ఆయన కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే వచ్చాయి. కాగా అజిత్ తమిళ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటికీ ఈ మూవీ తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లతో నెట్టుకొస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా రూ.250 కోట్ల కలెక్షన్లు సాధించి అజిత్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డివైడ్ టాక్‌తో అజిత్ ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించడాడంటే ఆయన క్రేజ్ తమిళ్లో ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. అజిత్ గత సినిమాలతో పోల్చితే తునివు సినిమాకు తెలుగులో ఎక్కువే బిజినెస్ జరిగింది. దాదాపు మూడు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం రెండు కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించి యావరేజ్ హిట్‌గా నిలిచింది. అయితే ఓవరల్‌గా మాత్రం ప్రాఫిట్ జోన్లోకి వెళ్లి బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇక మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 8 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
#AK 's #Thunivu has grossed more than
₹ 250 Crs+ at the WW Box office.. 🔥 #AK 's Highest Grosser..— Ramesh Bala (@rameshlaus) February 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

