Thunivu Movie | ‘తునివు’ మూవీ క్రేజీ అప్డేట్.. అజిత్ ఫ్యాన్స్‌కు పండగే..!
Thunivu First Single | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటులలో అజిత్ ఒకడు. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.
Thunivu First Single | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటులలో అజిత్ ఒకడు. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్‌తో తునివు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేస్తున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మరో అప్డేట్ ప్రకటించారు.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్ నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్‌తో కలిసి బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే అజిత్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా తెలుగులో రిలీజ్ అవుతుందో లేదో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే అజిత్-హెచ్. వినోద్ కాంబోలో వచ్చిన ‘నేర్కొండ పర్వాయ్’, ‘వలిమై’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఇక ‘తునివు’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

