ఏప్రిల్ 28న విడుదలై హిస్టరీ రిపీట్ చేసిన ఇండస్ట్రీ హిట్స్

కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజు ఏ సినిమా అయినా విడుదలైంది అంటే మాత్రం నిర్మాతలు చాలా ధైర్యంగా ఉంటారు. తమ సినిమా కచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని హాయిగా గుండెలపై చేయి వేసుకుని పడుకుంటారు. దానికి కారణం ఉంది.. ఆ రోజు చరిత్ర అలా ఉంది మరి. ఒకటి రెండు కాదు మూడు సినిమాలు ఆ రోజు చరిత్ర సృష్టించాయి. ఎప్రిల్ 28న విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా చరిత్రను ఎప్పటికప్పుడు మార్చేసాయి. ప్రతీ 15 ఏళ్లకు ఆ తేదీన విడుదలైన సినిమాలు చరిత్రకు తెరతీసాయి. ఆ సినిమాలేంటో చూద్దాం..
- అడవి రాముడు: సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా అడవి రాముడు. 1977లో విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ తిరగరాసింది. కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి అప్పట్లో చరిత్ర తిరగరాసింది. కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్థం చెప్తూ వచ్చిన అడవి రాముడు అన్నగారి ఇమేజ్ తో పాటు మార్కెట్ ను కూడా మరింత పెంచేసింది. అప్పట్లో ఈ సినిమా పాటలు కూడా పెద్ద హిట్టే.
- పోకిరి: అడవి రాముడు వచ్చిన 29 ఏళ్ళ తర్వాత మరోసారి ఎప్రిల్ 28న ఇంకో సినిమా విడుదలైంది. అదే పోకిరి. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను పూర్తిగా తుడిచేసింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు 39 కోట్ల షేర్ వసూలు చేసి పోకిరి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. అడవి రాముడు అప్పట్లో మార్కెట్ ను పెంచేస్తే.. పోకిరి ఎంత బడ్జెట్ అయినా వర్కవుట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచేసింది. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్ అయిపోయింది.
- బాహుబలి 2: పోకిరి విడుదలైన 11 ఏళ్ళకు మళ్లీ అదే రోజు ఇంకో సినిమా విడుదలైంది. అదే బాహుబలి 2. పోకిరి కేవలం తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తే.. బాహుబలి 2 మాత్రం ఏకంగా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. అసలు మన సినిమాలకు ఇంత స్టామినా ఉందా అని అంతా ఆశ్చర్యపోయేలా చరిత్ర తిరగరాసింది బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్లకు పైగా గ్రాస్.. 1200 కోట్ల నెట్.. 815 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

