Ramarao On Duty | రామారావుకు స్ట్రీమింగ్ పార్ట్నర్ దొరికేసింది..!
టాలీవుడ్ హీరో రవితేజ ( Ravi Teja) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వంలో యూనిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో రవితేజ ( Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పక్కా ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరో నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్నాడు. యూనిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ () ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది. రామారావుకు ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ దొరికేసింది.
రామారావు డిజిటల్ హక్కులను సోనీలివ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ విషయాన్ని సోనీలివ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందరితో పంచుకుంది. మరోవైపు ఇప్పటికే మేకర్స్ రామారావు టీజర్ను మార్చి1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. రామారావు షూటింగ్ చివరి దశలో ఉంది.

మార్చి 1న టీజర్తోపాటు సినిమా విడుదలపై కూడా క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నారు సినీ జనాలు. మరో రెండు రోజుల్లో దీనిపై పూర్లి క్లారిటీ రానుంది. రవితేజ మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర సినిమాలో నటిస్తున్నాడు. ఇదివరకెన్నడూ డిఫరెంట్ షేడ్స్ లో రవితేజ కనిపించబోతున్నట్టు టాక్. మరోవైపు త్రినాథ రావు నక్కినతో ధమాకా సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

