Kalyan Ram | పరిశ్రమలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి అగ్ర హీరో కల్యాణ్‌రామ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నూతన దర్శకులకు అవకాశమిస్తూ వినూత్న కథా చిత్రాల్లో భాగమవుతుంటారు. తాజాగా ఆయన తన 21వ చిత్రానికి అంగీకరించారు. ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.
అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. యాక్షన్ ఎంటర్టైనర్గా అలరిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణలు వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.