Indian 2 | ఇండియా పేరు మార్పు వివాదం.. కమల్ హాసన్ సినిమా టైటిల్‌పై కన్ఫ్యూజన్!
‘ఇండియా’ పేరు మార్పు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్'గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఇండియా’ పేరు మార్పు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ విషయంలో ప్రజల ఆలోచనలు, రాజకీయ పరమైన అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా.. ఈ పేరు మార్పు ఆలోచన ప్రస్తుతం ఓ సినిమాకు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టింది. ఆ సినిమానే ‘ఇండియన్-2’. శంకర్ దర్శకత్వంలో 27ఏళ్ల క్రితం విడుదలైన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఆ పేరే సమస్యగా మారింది.
తెలుగులో ఈ సినిమా ‘భారతీయుడు’గా విడుదలై అఖండవిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ దేశం పేరు మార్పు జరిగితే ప్రభుత్వ నిర్ణయం మేరకు.. తెలుగులో ‘భారతీయుడు-2’గా సినిమాను విడుదల చేయొచ్చు. కానీ అప్పట్లోనే తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ‘ఇండియన్’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆ పేరును మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మరి తమిళం, హిందీ భాషల్లో ఏ పేరు పెడతారు? ప్రస్తుతం ఈ విషయంపై సినీవర్గాల్లో పెద్ద చర్చే నడుస్తున్నది. అయితే ఈ విషయంలో దర్శకుడు శంకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

