Chiranjeevi | నాకు దక్కిన ఈ గౌరవం మీది.. పద్మవిభూషణ్‌పై చిరంజీవి
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్‌గా చెరగని ముద్రవేసుకున్న కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు.
Chiranjeevi | క్లాస్, మాస్, డ్యాన్స్, కామిక్ స్టైల్, స్టైలిష్ యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని టాలీవుడ్ మెగాస్టార్‌గా చెరగని ముద్రవేసుకున్నారు కొణిదెల చిరంజీవి (Chiranjeevi). ఈ స్టార్ హీరోకు అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు.
పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంతమనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం మీది.. నన్ను ఈ ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అంటూ సుదీర్థ సందేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమాలతో కోట్లాదిమంది అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న చిరంజీవికి కేంద్రప్రభుత్వం (అప్పటి) 2006లో పద్మభూషణ్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
పద్మవిభూషణ్‌పై చిరంజీవి సందేశం..
🙏🙏🙏 pic.twitter.com/4PDaCV2kzv
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

