Thimmarajupalli TV | కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ఫస్ట్ సింగిల్ విడుదల!
Thimmarajupalli TV | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
Thimmarajupalli TV | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆయన తన KA ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమైరా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. చిన్ని చిన్ని గుండెలోన చానా ప్రేమే దాచినా అంటూ వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ శనివారం రాత్రి విడుదలైంది.
ఈ పాట ఒక గ్రామీణ నేపథ్యంలో, మనసుకు హత్తుకునే రొమాంటిక్ ట్రాక్‌గా ఉంది. ఇది అచ్చమైన పల్లె వాతావరణాన్ని, స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు సానారే సాహిత్యం అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కళ్యాణ్ కలిసి పాడారు. వంశీకాంత్ రేఖాన సంగీతం అందించాడు. ఈ పల్లెటూరి నేపథ్య ప్రేమ కథా చిత్రంలో సాయి తేజ్, వేద్ జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహించారు. ‘చిన్ని చిన్ని గుండెలోన’ పాట ఇప్పటికే ప్రేక్షకుల్లో చక్కటి ఫీల్‌ను పంచుతూ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

