తెలంగాణ యాస నేర్చుకున్నా!
‘దసరా’ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించాను. యూనివర్సల్ కథాంశంతో అన్ని భాషల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’ అన్నారు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ‘దసరా’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషించారు.
‘దసరా’ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించాను. యూనివర్సల్ కథాంశంతో అన్ని భాషల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’ అన్నారు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ‘దసరా’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషించారు. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నాని క్లోజ్‌ఫ్రెండ్ సూరి పాత్రలో కనిపిస్తా. ‘దసరా’ వంటి పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. నేను ‘మీట్ క్యూట్’ వెబ్‌సిరీస్ చేశాను. అందులో నా నటన చూసి ‘దసరా’లో అవకాశమిచ్చారు. ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా. ఇక్కడి ఆచారవ్యవహారాలు, సంప్రదాయాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. షూటింగ్ సమయంలో నానితో కలిసి పదినెలల పాటు ప్రయాణించాను. చక్కటి క్రమశిక్షణ వల్లే ఆయన గొప్ప స్టార్‌గా ఎదిగారు. నాని నుంచి చాలా స్ఫూర్తిపొందాను. కన్నడనాట కూడా ‘దసరా’ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడ కూడా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

