నవీన్‌రాజ్ శంకరపు, పూజ సహాసిని, శ్రీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విలేజ్ పొలిటికల్ డ్రామా ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. కైలాష్ దుర్గం నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇది సముద్రతీరంలోని ఓ ఊరికథ అని ట్రైలర్ చెబుతున్నది.
ప్రేమ, ఆప్యాయతలతో కలిసిమెలసి ఉండాల్సిన ఊరిలో రాజకీయాలు, భేద భావాలు హెచ్చరిల్లితే.. ఆ పరిస్థితులపై పోరాడుతున్న ఓ యువకుడి కథ ఇదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాకీ, నాగమహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్‌కుమార్, కెమెరా: అజీమ్ అండ్ వెంకట్, సంగీతం: ప్రజాల్ క్రిష్, నిర్మాణం: అనన్య క్రియేషన్స్.