Ram pothineni | భారీ ధరకు అమ్ముడయిన ‘ది వారియర్’.. డిజిటల్, శాటిలైట్ హక్కులు
ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్రస్తుతం ఈయన ది వారియర్ చిత్రంలో నటిస్తున్నాడు.
Ram pothineni | ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో జోరుమీదున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్రస్తుతం ఈయన ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి డిజిటల్ శాటీలైట్ హక్కులు కలిపి దాదాపు 35 కోట్లకు డిస్నీ+హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. రామ్ కు ఉన్న క్రేజ్, మార్కెట్ పరంగా ఇంత బిజినెస్ చాలా ఎక్కువ మొత్తమేనని చెప్పాలి. లింగుస్వామి ఈ చిత్రాన్ని కర్నూలు బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నాడని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ నుండి రామ్ యాక్షన్ కథలకే మొగ్గు చూపుతున్నాడు. ఈ చిత్రం అనంతరం రామ్, బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

