The Vaccine War Movie | సలార్‌కు పోటీగా ది వ్యాక్సిన్ వార్.. డైనోసార్‌కు ఎదురెళ్తున్నారేంటి?
The Vaccine War Movie | పెద్ద పెద్ద సినిమాలే సలార్ దరిదాపుల్లో రావడానికి భయపడుతుంటే.. ది వాక్సిన్ వార్ ఏకంగా ఈ సినిమాకే పోటీగా వస్తుంది. ఇప్పటికే సలార్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు.
The Vaccine War Movie | కశ్మీర్ పండిట్లపై జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారని ఎన్ని బోల్డ్ కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఎగబడి మరీ సినిమా చూశారు. దక్షిణాదిన పెద్దగా ఆడలేదు కానీ.. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక ఈ సినిమా కెప్టెన్ వివేక్ అగ్నిహోత్రి పేరు హిందీ నాట మార్మోగిపోయింది. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ అనే సినిమా చేస్తున్నాడు.
కరోనా టైమ్‌లో జరిగిన పరిస్థులు, ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కూడా ప్రాపగాండ సినిమా అని టాక్. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఓ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేసింది. భారతదేశపు తొలి బయో-సైన్స్ సినిమాగా ప్రమోట్ చేస్తూ రిలీజైన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ముందుగా ఈ సినిమాను అగ్నిహోత్రి ముందుగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ సడెన్‌గా తన ప్లాన్ చేంజ్ చేసుకునిసెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాలని మొండి పట్టున కూర్చున్నాడట. కాగా అదే రోజున సలార్ కూడా రిలీజవుతుంది.
పెద్ద పెద్ద సినిమాలే సలార్ దరిదాపుల్లో రావడానికి భయపడుతుంటే.. ది వాక్సిన్ వార్ ఏకంగా ఈ సినిమాకే పోటీగా వస్తుంది. ఇప్పటికే సలార్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని సౌత్ ప్రేక్షకులే కాదు ఉత్తరాది ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఉన్నారు. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా.. దాని ప్రభాసం కనీసం రెండు, మూడు వారాలైనా ఉంటుంది. పైగా ప్రభాస్‌కు నార్త్‌లో మాములు క్రేజ్ లేదు, సాహో, ఆదిపురుష్ వంటి డిజాస్టర్ సినిమాలే హిందీనాట సంచలన వసూళ్లు రాబట్టింది. అలాంటిది ది మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా వస్తున్న సలార్ చరిత్ర తిరగరాయడం పక్కా అని ట్రేడ్ పండింతులు అంటున్నారు. చూడాలి మరి సలార్ పోటీని తట్టుకుని వాక్సిన్ వార్ నిలుస్తుందా? లేదా? అని.
‘THE VACCINE WAR’: VIVEK AGNIHOTRI LOCKS RELEASE DATE… After the #Blockbuster run of #TheKashmirFiles, #VivekRanjanAgnihotri’s next film – titled #TheVaccineWar – to release in *cinemas* on 28 Sept 2023… Stars #NanaPatekar, #PallaviJoshi, #RaimaSen, #SapthamiGowda and… pic.twitter.com/1uoGEGPWbT
— taran adarsh (@taran_adarsh) August 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

