Actor Vishal | నటుడు విశాల్ ఆరోగ్యంపై స్పందించిన టీమ్
Actor Vishal Health | నటుడు విశాల్ ఆదివారం విల్లుపురంలో జరిగిన మిస్ కూవగం 2025 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
Actor Vishal Health | నటుడు విశాల్ ఆదివారం విల్లుపురంలో జరిగిన మిస్ కూవగం 2025 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దీనితో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే, విశాల్ టీమ్ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చింది.
విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ లేదా అలసట కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా భావిస్తున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్య సమాచారం తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. కాగా, విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. కొన్ని నెలల క్రితం డెంగ్యూ నుండి కోలుకున్న విశాల్ మళ్లీ అస్వస్థతకు గురికావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఆయన టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

