అన్‌స్క్రిప్టెడ్ ది రానా దగ్గుబాటి షో
‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో హీరో రానా సెలబ్రిటీ టాక్‌షోకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్పిరిట్ మీడియా పతాకంపై స్వీయ నిర్మాణంలో రానా ఈ టాక్‌షోను రూపొందించారు.
‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో హీరో రానా సెలబ్రిటీ టాక్‌షోకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్పిరిట్ మీడియా పతాకంపై స్వీయ నిర్మాణంలో రానా ఈ టాక్‌షోను రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం టాక్‌షోకు సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఇది వరకు నేను కొన్ని టాక్‌షోలు చేశాను. కానీ ఇది చాలా విభిన్నమైనది.
ఇతర టాక్‌షోల మాదిరిగా ఎలాంటి నాటకీతయ లేకుండా సహజంగా అనిపిస్తుంది. ఎలాంటి ముందస్తు స్క్రిప్ట్ లేకుండా సెలబ్రిటీల మదిలోని భావాల్ని యథాతథంగా ఆవిష్కరిస్తుంది. వారికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేస్తుంది. 240 దేశాల్లో ఈ షో ప్రసారమవుతుంది’ అన్నారు. ‘ది రానా దగ్గుబాటి షో’లో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, నాని, రిషబ్‌శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ వంటి అనేకమంది ప్రముఖులు పాల్గొంటున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతినిధులు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

