The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ జాతర.. యూట్యూబ్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న ‘ఏశనాగుల’ సాంగ్!
The Paradise | న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏశనాగుల’ పాట సోషల్ మీడియాలో మాస్ జాతర సృష్టిస్తోంది.
The Paradise | న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏశనాగుల’ పాట సోషల్ మీడియాలో మాస్ జాతర సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్ స్థానానికి చేరి దూసుకెళ్తోంది. ‘ది ప్యారడైజ్’ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఏశనాగుల’ పాటకు ఆయన అందించిన పవర్ఫుల్ మాస్ బీట్స్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ జానపద శైలికి మోడ్రన్ మ్యూజికల్ టచ్ జోడించి రూపొందించిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.
ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన పల్లెటూరి నేటివిటీతో కూడిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డిలు తమ ప్రత్యేకమైన గాత్రంతో ఈ పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. జానపద ఫీల్‌తో పాటు మాస్ ఎనర్జీ కలగలిపిన ఈ సాంగ్ ప్రస్తుతం అన్ని వర్గాల శ్రోతలను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో విడుదలైన వెంటనే ‘ఏశనాగుల’ పాటకు భారీ స్పందన లభించింది. శరవేగంగా వ్యూస్, లైక్స్, షేర్స్ పెరుగుతూ ఈ పాట ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరింది. మ్యూజిక్ లవర్స్‌తో పాటు నాని అభిమానులు ఈ పాటను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా పాటలోని పవర్ఫుల్ బీట్స్‌కు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో భారీ స్థాయిలో వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో విడుదలైన కొద్ది సమయంలోనే ఈ సాంగ్ సోషల్ మీడియా ట్రెండ్‌గా మారిపోయింది.
‘ఏశనాగుల’ పాటలో నాని కనిపించిన మాస్ అండ్ రస్టిక్ అవతార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. న్యాచురల్ నటనతో ప్రేక్షకులను మెప్పించే నాని.. ఈసారి పూర్తి భిన్నమైన, రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతున్నారనే అంచనాలను ఈ పాట మరింత పెంచేసింది. నాని స్క్రీన్ ప్రెజెన్స్, రస్టిక్ మాస్ వైబ్, అనిరుధ్ పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బీట్స్ కలిసి పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాని ఈ సినిమాలో కనిపించబోతున్నారనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ హైప్ ఉంది. ‘దసరా’లో నాని రస్టిక్ మాస్ అవతార్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ఒదేల.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో అంతకుమించి విభిన్నమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

