Idupu Kayitham | తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, నాగదుర్గల ‘ఇడుపు కాయితం’.. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన లోకేష్ కనగరాజ్!
Idupu Kayitham | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి నాగదుర్గ కథానాయికగా సరికొత్త చిత్రం ప్రారంభమైంది.
Idupu Kayitham | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి నాగదుర్గ కథానాయికగా సరికొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ‘ఇడుపు కాయితం’ అంటే తెలంగాణ వాడుక భాషలో విడాకులు(divorce) అని అర్థం. ఈ చిత్రం నేడు ఘనంగా పూజా కార్యక్రామలను జరుపుకోగా.. చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.
తెలుగు చిత్రసీమలో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), బన్నీ వాస్ వర్క్స్ (Bunny Vas Works) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుకుమార్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.
మన మూలాల సువాసన.. ప్రతి ఇంటి కథ” (The fragrance of our roots. The story of every home) అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబ కథాంశంతో రూపకల్పన కానుంది. భార్యాభర్తల అనుబంధం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల కలబోతగా, అచ్చమైన పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబిస్తూ ఈ చిత్రం సాగనుంది. తెలంగాణ జానపద పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో తన అద్భుత నాట్యాభినయంతో సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలు (Views) సొంతం చేసుకున్న నాగదుర్గ, ఈ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇక ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. వచ్చే నెల (జూలై) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమాకు సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

