నరేశ్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకుడు. కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథిరా ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని హీరో సత్యదేవ్ విడుదల చేశారు.
‘కిస్మత్’ అంటే అదృష్టం. ఈ సినిమా పేరులోనే అదృష్టం ఉంది. కాబట్టి సినిమా మంచి హిట్. అందరికీ శుభాకాంక్షలు’ అని సత్యదేవ్ అన్నారు. అజయ్‌ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చరవి తదితరలు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె.రాబిన్, కెమెరా: వేదరామన్ శంకర్, నిర్మాత: రాజు.