ఓ అభిమానిలా పనిచేశా!
‘నేను ఫస్ట్‌టైమ్ కలిసి పనిచేసిన హీరోలందరి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో చేసిన ‘గాడ్‌ఫాదర్' బ్లాస్‌బస్టర్ హిట్కావడంతో ఆ సెంటిమెంట్ మళ్లీ నిజమైంది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.
‘నేను ఫస్ట్‌టైమ్ కలిసి పనిచేసిన హీరోలందరి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో చేసిన ‘గాడ్‌ఫాదర్’ బ్లాస్‌బస్టర్ హిట్కావడంతో ఆ సెంటిమెంట్ మళ్లీ నిజమైంది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఇటీవల విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి ఆయన సంగీతాన్నందించారు. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తమన్ పాత్రికేయులతో ముచ్చటించారు…
ఈ సినిమా కోసం నేనూ, దర్శకుడు మోహన్‌రాజా ఏడాది పాటు కష్టపడ్డాం. సంగీతానికి అంతగా ప్రాధాన్యతలేని ఓ సీరియస్ కథాంశంలో మ్యూజిక్కు పెద్దపీట వేయడం సవాలుగా అనిపించింది. సినిమా కథాంశం, చిరంజీవిగారి పాత్ర తాలూకు పవర్‌ను చూపించేలా యూనివర్సల్ బాస్ ఫీలింగ్‌తో సౌండ్ డిజైన్ చేశాం. లండన్‌లోని ఫేమస్ అబేయ్ రోడ్ స్టూడియోస్‌లో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాం. అక్కడ రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇం డియన్ సినిమా ‘గాడ్‌ఫాదర్’ కావడం విశేషం.
ఆ ప్రశంస మర్చిపోను
చిరంజీవిగారు ఓ మహావృక్షం. ఆయనకు ఎంత క్వాలిటీతో మ్యూజిక్ ఇచ్చినా ఇంకా తక్కువే అనిపిస్తుంటుంది. అందుకే నెక్ట్స్ లెవల్లో సంగీతం ఉండాలని టీమ్ అంతా శ్రమించాం. ఈ సినిమా కోసం నేను ఓ మ్యూజిషియన్‌గా కంటే చిరంజీవిగారి అభిమానిగా పనిచేశా. ‘నజభజజజరా..’ అనే పాటతో ఫైట్ సీక్వెన్స్ చేశాం. పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాటను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో చిరంజీవిగారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ జీవితంలో మర్చిపోలేను. దర్శకుడు శంకర్‌గారు ఫోన్ చేసి మ్యూజిక్ బాగుందని అభినందించారు. మణిశర్మ, కోటిగారు కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. నాతో కలిసి ఓ కమర్షియల్ సినిమా చేస్తానని చిరంజీవిగారు మాటిచ్చారు. ‘గాడ్‌ఫాదర్’ విజయం నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

