శివకార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. సునీల్ నారంగ్, సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ప్రేమ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ‘బింబిలిక్కి పిలాపి’ అనే ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం విడుదల చేశారు.
డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ మాస్ బీట్‌ను అందించారు. శివకార్తికేయన్ నృత్యం ఆకట్టుకుంది. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి ఆలపించారు. మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, సమర్పణ: సోనాలి నారంగ్, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.