పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker). ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ రీసెంట్గా సీతారామం సినిమాలో కూడా మెరిశాడు. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు తరుణ్ భాస్కర్. ఈ యువ దర్శకుడు తీస్తున్న కొత్త చిత్రం కీడా కోలా (Keedaa Cola). 2021 జూన్‌లోనే ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. క్రైం కామెడీ నేపథ్యంలో రాబోతున్న సినిమా రేపు లాంఛ్ కాబోతున్నదని నేడు అప్డేట్ ఇచ్చేశాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కీడా కోలా చిత్రం తరుణ్ భాస్కర్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై నిర్మించనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రేపు క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రాజెక్టు.