Thangalaan Movie | విక్రమ్‌కు ‘తంగలాన్’ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను మొదట జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు పా.రంజిత్ వెల్లడించాడు.
అయితే నేడు విక్రమ్ బర్త్ డే. ఈ సందర్భంగా తంగలాన్ టీమ్ విక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. బర్త్ డే ట్రిబ్యూట్ పేరిట ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో విక్రమ్ తంగలాన్‌గా ఎలా రూపాంతరం చెందాడు అనేది చూడవచ్చు. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

