స్వేచ్ఛ కోసం చేసే పోరాటం
‘పా రంజిత్ నా అభిమాన దర్శకుడు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ఇందులో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది’ అన్నారు చియాన్ విక్రమ్.
‘పా రంజిత్ నా అభిమాన దర్శకుడు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ఇందులో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది’ అన్నారు చియాన్ విక్రమ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు.
సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విక్రమ్ మాట్లాడుతూ ‘బంగారం వేట చుట్టూ ఈ కథ నడుస్తుంది. అసమానతలకు గురైన ఓ తెగ స్వేచ్ఛ కోసం ఎలాంటి పోరాటం చేశారన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. తంగలాన్ అన్నది ఓ తెగ పేరు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. మేకప్ కోసం గంటల కొద్ది సమయం పట్టేది. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మరచిపోతాం.
ఈ పాత్రను ఎంతగానో ఇష్టపడి చేశాను కాబట్టి షూటింగ్ జరిగిన ప్రతి రోజుని ఎంజాయ్ చేశాను. అవార్డులు నాకు ఇష్టమే కానీ..అంతకంటే ముఖ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి’ అన్నారు. ఈ సినిమాలో తాను ఆరతి అనే పాత్రలో కనిపిస్తానని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవలకాలంలో రూపొందిన టఫెస్ట్ మూవీ ఇదేనని కథానాయిక మాళవిక మోహనన్ తెలిపింది. ఈ సినిమాలో దర్శకుడు పా రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారని మరో నాయిక పార్వతీ తిరువోతు పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

