Thammudu OTT | ఓటీటీలోకి నితిన్ ‘తమ్ముడు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Nithiin Thammudu on Netflix | టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన్న తాజా చిత్రం తమ్ముడు (Thammudu). వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటించింది.
Nithiin Thammudu on Netflix| టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన్న తాజా చిత్రం తమ్ముడు (Tammudu). వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌తో పరాజయం అందుకుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను తాజాగా పంచుకున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగష్టు 01నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ కొట్టాలనేది జై (నితిన్) లక్ష్యం. అయితే తన మనసులో ఏదో వెలితి. దీనికి కారణం చిన్నప్పుడు తనని వదిలి వెళ్లిపోయిన అక్క ఝాన్సీ కిరణ్మయి (లయ). అక్కని కలసి తమ్ముడు అని పిలిపించుకొంటే గాని, తన వెలితి తగ్గదని జైకి అర్థం అవుతుంది. కట్ చేస్తే… అజర్వాల్ (సౌరబ్ సచ్దేవ్) గ్యాంగ్ కారణంగా ఝాన్సీ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అసలు అజర్వాల్ ఎవరు? ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశాడు? ఝాన్సీ, జై ఎందుకు దూరమయ్యారు? ఝాన్సీని కాపాడటానికి జై ఎలాంటి పోరాటాలు చేశాడు? అనేది తక్కిన కథ. ఈ సినిమాలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
Thana lakshyanni, akkani thirigi thevadaniki ee thammudu is on a mission!
Watch Thammudu on Netflix, out 1 August in Telugu, Tamil, Malayalam and Kannada.#ThammuduOnNetflix pic.twitter.com/5mAUQ9GXwY— Netflix India South (@Netflix_INSouth) July 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

