పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు థమన్ పాత్ర కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. పాటలు సినిమా రేంజ్ పెంచేసాయి. మగువ మగువ పాట అయితే మరో స్థాయిలో ఉంది.
తాజాగా డైరెక్టర్ థమన్ ఫ్లైట్లో వెళ్తూ ఈ సినిమాను వీక్షించినట్టు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ‘నేను ఫ్లైట్లో వకీల్ సాబ్ సినిమా చూస్తున్నానని, చెప్పాడు .అంతేకాకుండా వకీల్ సాబ్ బీజీఎంను నవంబర్ 16న రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.