Thalaivar 170 | రజినీకాంత్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘తలైవా 170’ టైటిల్ రివీల్ ఆరోజే.?
Thalaivar 170 | జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170)తో రజినీ బిజీగా ఉన్నాడని తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Thalaivar 170 | జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170)తో రజినీ బిజీగా ఉన్నాడని తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమా టైటిల్‌ను రజినీకాంత్ (Rajinikanth) పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రజనీ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం.
ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజువారియర్, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.
జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ సిల్వర్ స్క్రీన్‌పై తలైవాను ఎలా చూపించబోతున్నాడని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. రజినీకాంత్ మరోవైపు కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తుండగా.. షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ పొంగళ్ 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్ దీంతోపాటు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

