Bunny Vas | అల్లు అర్జున్ స్టైల్‌పై కామెంట్.. జర్నలిస్ట్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు
Allu Arjun | టాలీవుడ్ నటుడు, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం వైరల్ మీమ్ అయిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ షర్ట్ ధరించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.
Allu Arjun | టాలీవుడ్ నటుడు, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం వైరల్ మీమ్ అయిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ షర్ట్ ధరించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో బన్నీ వేసుకున్న టీ షర్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ విషయం గురించి ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ బన్నీకి వార్తల్లో ఉండడం ఎలాగో బాగా తెలుసు అంటూ ఒక ట్వీట్ వేశారు. అయితే ఈ విషయం స్పందించిన నిర్మాత బన్నీ వాసు జర్నలిస్ట్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా..? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు.
వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లో రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు సార్..? అంటూ బన్నీ వాసు రాసుకోచ్చాడు.
Dear @sairaaj44 గారు
ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ… https://t.co/vGOfVo2Jr1
— Bunny Vas (@TheBunnyVas) May 3, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

