నటుడు పొట్టి వీరయ్యకు టాలీవుడ్ నివాళి

హైదరాబాద్ : ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మృతదేహానికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది. నట దంపతులు జీవితా, డాక్టర్ రాజశేఖర్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు వీరయ్య మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి సమర్పించారు. వీరయ్య గుండెపోటు కారణంగా ఆదివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే.
వీరయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి వీరయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వీరయ్య జీవితంలో చాలా పోరాటాలను ఎదుర్కొన్నాడన్నారు. ఐదు దశాబ్దాలుగా వివిధ భాషా చిత్రాలలో నటించిన వీరయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడని చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.
పరిశ్రమకు చెందిన వారి నుండి ప్రేమ, మద్దతు లభించకపోతే తాను బ్రతికి ఉండేవాడిని కాదని వీరయ్య వివిధ ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి లభించిన నగదు సహాయం, మద్దతు కారణంగా మాత్రమే తాను తినేందుకు, ఆశ్రయం పొందేందుకు పెద్దగా ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడపగలిగినట్లు తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

