Vijay Antony | ‘బిచ్చగాడు-2’తో తెలుగులో మరో విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హత్య’. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. బాలాజీ కుమార్ దర్శకుడు. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్సినిటీ ఫిల్మ్ వెంచర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ర్టాల్లో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇన్విస్టిగేటివ్ డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని ఈ చిత్రంలో కనిపిస్తారు’ అన్నారు. జాన్ విజయ్, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం.