Allu Arjun | అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్.. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ రద్దు
Allu Arjun | హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Allu Arjun : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉన్నదని, అంతమాత్రాన కేసును ఒక్కరిపైనే రుద్దలేమని కోర్టు వ్యాఖ్యానించింది. అర్నాబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.
రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని, కేసులో విచారణకు సహకరించాలని మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు అల్లు అర్జున్‌కు సూచించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నది. జైలు సూపరింటెండెంట్‌కు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల విషయం తెలుపాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ లాయర్ కోరగా.. తాము ఆదేశాలు పంపిస్తామని న్యాయమూర్తి చెప్పారు.
మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు తరలించిన అల్లు అర్జున్ను మరికాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
Delimitation | వింటర్ సెషన్లో డీలిమిటేషన్.. డిసెంబర్ మొదటివారంలో పార్లమెంట్ సమావేశాలు
Srisailam Reservoir | శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం.. వేసవిలో తాగునీటికి తప్పని కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

