Mirai Movie | ‘మిరాయ్’ గా వస్తున్న హనుమాన్ హీరో.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్
Teja Sajja | ‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంతరం అతడికి వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది.
Teja Sajja | ‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంతరం అతడికి వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సూపర్యోధగా కనిపించనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌తో పాటు గ్లింప్ల్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు మిరాయ్ (Mirai) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం.
మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పశ్చాతాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే తేజ సజ్జా. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట దూసుకుపోతుంది. ఇందులో తేజ సజ్జా స్టెలిష్ మేక్ ఓవర్‌తో సూపర్యోధగా కనిపిస్తున్నాడు.
ఇక భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

