Nana Patekar | బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ఈ రోజు తెల్లవారుఝామున కన్నుమూసిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయసులో అక్టోబర్ 8న గోవాలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నానా పటేకర్ మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నానా పటేకర్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. తాను ఈ వార్త విన్నానని, అయితే వెంటనే ఎలాంటి స్పందన ఇవ్వాలో తనకు అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తాను లక్నోలో జరగబోయే ఓ ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నానని, దానిపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది తనకు చాలా విచిత్రమైన పరిస్థితి అని, తాను ముందుగా ఒక కార్యక్రమం కోసం సిద్ధమై ఉన్న సమయంలో ఈ వార్త వచ్చిందని చెప్పారు. ఈ వార్త కారణంగా మీడియా మొత్తం ఆ అంశంపైనే దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన వీడియోలో ‘ఈవిల్ డెడ్’ అనే పదాన్ని ఉపయోగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నానా పటేకర్ కుటుంబానికి మాత్రం ఆమె సానుభూతి తెలిపారు. తను పూర్తిగా ఎలా స్పందించాలో అని ఇంకా ఆలోచిస్తున్నానని ఆమె వెల్లడించారు.
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ మధ్య వివాదం కొత్తది కాదు. 2018లో బాలీవుడ్లో మీటూ ఉద్యమం తీవ్ర చర్చకు వచ్చిన సమయంలో నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తనతో నానా పటేకర్ అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తన అభ్యంతరాలను పట్టించుకోకుండా అసౌకర్యంగా అనిపించే నృత్య భంగిమలు చేయాలని ఒత్తిడి చేశారని ఆమె అప్పట్లో వెల్లడించారు. నానా పటేకర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.ఈ వివాదం తర్వాత బాలీవుడ్లో మీటూ ఉద్యమంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి, 2019లో తగిన ఆధారాలు లభించలేదని పేర్కొన్నట్టు సమాచారం.
This is Pathetic 😤😠
#TanushreeDutta says she’s heard about #NanaPatekar’s demise and is worried that her event might get affect by this. “Evil Dead.Such an odd day. I have an important event today and now this. Media will be asking questions and I’ll give my reaction to all of them.”
— $@M (@SAMTHEBESTEST_) October 8, 2026