నయనతార కనెక్ట్ మూవీకి బిగ్ షాక్.. రిలీజ్‌పై ఆసక్తి చూపించని థియేటర్ ఓనర్స్.. కారణం ఏంటంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. తమిళనాడులోని థియేటర్ల యాజమానులు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదట.
Connect Movie | లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కనెక్ట్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్,ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా రిలీజవుతున్న ఈ సినిమాకు తమిళనాట బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని థియేటర్ల యాజమానులు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదట. ఇంటర్వెల్ టైమ్‌లో అమ్మే కూల్‌డ్రింగ్స్, పాప్ కార్న్, చిప్స్ వంటి వాటితో తమకు ఎంతో కొంత డబ్బు వస్తుందని, ఇప్పుడు అసలు బ్రేక్ లేకుండా సినిమా వేస్తే ఆ డబ్బు రాకుండా పోతుందని భావిస్తున్నారు.
దీనిపై థియేటర్ యజమానులు ఈ చిత్ర నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లాక్డౌన్ టైమ్‌లో ఓ అమ్మాయి చేసిన పనికి ఇంటిల్లిపాది ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నారు. ఆ సమస్య నుండి తీరిపోయిందా? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మయూరి, గేమ్ ఓవర్ వంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

