సామాజిక న్యాయం గురించి చర్చించాం
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మామన్నన్' తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలవుతున్నది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టీఫ్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. నేడు విడుదలకానుంది.
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలవుతున్నది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టీఫ్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘తమిళంలో ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సామాజిక న్యాయం, సమానత్వం గురించి ఈ సినిమాలో చర్చించాం. ఇదొక పొలిటికల్ డ్రామా. సార్వజనీన అంశాలతో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ కథ వినగానే ఆసక్తి కలిగింది. ఇప్పటివరకు నేను కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశాను.
కానీ ఈ కథలో సామాజిక పరివర్తన జరగాలనే గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు నా తండ్రి పాత్రలో నటించారు. కథాపరంగా ఆ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుంది. తండ్రి పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు వడివేలు పేరును సూచించారు. అయితే ఆయన అంత సులభంగా అంగీకరించలేదు. నేనే ఫోన్ చేసి ఒప్పించాను. ఆయన ఇమేజ్‌కు భిన్నంగా వడివేలు సీరియస్ రోల్లో కనిపిస్తారు. కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రతిభావంతులైన నటులు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఇదే నా చివరి చిత్రమనుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

