తమిళ హీరో తెలుగు దండయాత్ర.. టాలీవుడ్ పై శివ కార్తికేయన్ ఫోకస్..

varun doctor | ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు తమిళ ఇండస్ట్రీకి.. తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీకి రావడం కామన్ అయిపోయింది. మొన్నటి వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన తమిళ హీరోలు.. ఇప్పుడు వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో తమిళ హీరో కూడా తెలుగు మార్కెట్‌పై సీరియస్‌గా ఫోకస్ చేశాడు. ఆయన ఎవరో కాదు శివ కార్తికేయన్. ఇప్పటికే ఈయన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మార్కెట్ మాత్రం సంపాదించుకోలేదు. కీర్తి సురేశ్ హీరోయిన్గా వచ్చి రెమో సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంది.
దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేశాడు. అయితే కలెక్షన్స్ మాత్రం రాలేదు. కానీ శివ కార్తికేయన్ అనే ఒక హీరో ఉన్నాడు అని తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈయన నటించిన డాక్టర్ సినిమా తెలుగులో భారీగా విడుదల కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా బీస్ట్ సినిమాను తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్ డాక్టర్ సినిమాకు దర్శకుడు. తెలుగులో ఈ సినిమాను వరుణ్ డాక్టర్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ ( సెప్టెంబర్ 25న ) సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. యంగ్ హీరో నితిన్.. వరుణ్ డాక్టర్ ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నాడు.
Stay Tuned !!! #VarunDoctor Trailer Out Today at 6:30PM Launch by youth star @actor_nithiin.#VARUNDOCTORFromOct9@Siva_Kartikeyan @Nelsondilpkumar @KalaiArasu_ @anirudhofficial @priyankaamohan #MaheshreddyMooli pic.twitter.com/2PjvCVZP8u
— BA Raju's Team (@baraju_SuperHit) September 25, 2021
కే. జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేశ్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా.. తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్. మరి వరుణ్ డాక్టర్ సినిమాతో శివ కార్తికేయన్ తెలుగులో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

