Vishal | హీరో విశాల్‌కు అస్వస్థత.. వేదికపైనే స్పృహ తప్పిపడిపోయిన నటుడు..!
Vishal | ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పిపడిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Vishal | ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పిపడిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమాచారం ప్రకారం.. తమిళనాడు విల్లుపురంలో ఆదివారం మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విశాల్ హాజరయ్యారు. కొద్దిసేపటికే విశాల్ స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వెంటనే ఆయన టీమ్, మాజీ మంత్రి కే పొన్ముడి సహా కార్యక్రమం నిర్వాహకులు వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ ఘటనలో విశాల్ అభిమానులతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు.
ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం స్పందించలేదు. విశాల్ మేనేజర్ హరి మాట్లాడుతూ ఆయన భోజనం చేయకపోవడం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో నటుడు డెంగ్యూ బారినపడి కోలుకున్నారు. ఇటీవల విశాల్ తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. దాంతో ఆయన ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు రాగా.. వాటన్నింటిని ఆయన టీమ్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. అయితే, విశాల్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా.. విశాల్ ఇటీవల ‘మద గజ రాజా’ సినిమాలో నటించారు. తుప్పరివాలన్-2 (తెలుగులో డిటెక్టివ్) మూవీలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

