కాస్త జోరు తగ్గిన ప్రతిసారీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో సత్తా చాటుతుంటుంది అందాల తార తమన్నా. ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది అనుకుంటున్న సమయంలో తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’. తమిళంలో రజనీకాంత్ జోడీగా ‘జైలర్’ చిత్రాల్లో నటిస్తూ మళ్లీ తన జోరు చూపిస్తున్నది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు తేడాలో విడుదల కానుండటం ఆమెలో ఉత్సాహాన్ని నింపుతున్నది.
‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదలవుతుండగా…‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతున్నది. ఒక రోజు తేడాలో ఇద్దరు పెద్ద హీరోలతో తాను చేసిన సినిమాలు తెరపైకి వస్తుండటం పట్ల తమన్నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. నాయికల కెరీర్లో అరుదుగా ఇలాంటి సందర్భం వస్తుందని అంటున్నారు. ‘భోళా శంకర్’ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ రూపొందిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రను పోషిస్తున్నది. ఇక ‘జైలర్’ చిత్రాన్ని దర్శకుడు నీల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్నారు.