వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ భామ రజనీకాంత్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలోని ‘నువ్ కావాలయ్య’ అనే పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల జరిగిన చిత్ర ఆడియో వేడుకలో ఈ పాటను పర్ఫార్మ్ చేసింది తమన్నా. ఆమె చేసిన నృత్యాలకు యువత ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాట గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తమన్నా.
‘నటిగా నా సుదీర్ఘ కెరీర్లో సరికొత్త అనుభవమిది. ఈ పాట ఇంతమందికి నచ్చడం, సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలో నేను చేసిన డ్యాన్స్ కెరీర్లోనే బెస్ట్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘జైలర్’ పక్కా తమిళ చిత్రం. ఇక్కడి నేటివిటీతో కనిపిస్తుంది. అయితే కథలో ఉండే అంశాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి’ అని తమన్నా పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.