Taapsee Pannu | మహిళా ప్రధాన చిత్రాలపై (Female-Centric Films) బాలీవుడ్ నటి తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ (Alpha) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వలన ఈ చిత్ర ప్రభావం ఇతర ఫీమేల్ లీడ్ సినిమాలపై పడుతుందని తాప్సీ తెలిపారు. పరిశ్రమలో పెద్ద హీరోయిన్ల చిత్రాలు ఫ్లాప్ అయినప్పుడు, ఫ్లాప్ ప్రభావం కేవలం ఆ సినిమాపైనే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఇతర మహిళా ఓరియెంటెడ్ సినిమాలపై కూడా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ చిత్రాలు నిరాశపరిచినప్పుడు, సినిమాలకు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు, నిర్మాతలు వెనుకడుగు వేస్తారని… ఫలితంగా తమకు రావాల్సిన ఆఫర్లు తగ్గిపోవడమే కాకుండా కొన్ని సినిమాలు ఆగిపోయే (Shelve) పరిస్థితి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.