అతని ప్రేమలో ఉన్నా!
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమాయణం గురించి అప్పట్లో అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన లవ్‌ఎఫైర్‌పై ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాంతో ఈ జంట ప్రేమకథ ముగిసిపోయిందని అందరూ భావించారు.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమాయణం గురించి అప్పట్లో అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన లవ్‌ఎఫైర్‌పై ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాంతో ఈ జంట ప్రేమకథ ముగిసిపోయిందని అందరూ భావించారు. తాజాగా ఈ విషయంపై తొలిసారిగా తన మనసులో మాటను బయటపెట్టింది తాప్సీ. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని చెప్పింది. ‘దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయమైంది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది.
అయితే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. మాథిస్ బోతో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ రాలేదు’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. గత ఏడాది ఈ భామకు బాగా కలిసొచ్చింది. షారుఖ్‌ఖాన్‌తో జోడీగా ఆమె నటించిన ‘డంకీ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సక్సెస్ జోష్‌లో తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నది తాప్సీ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

