Taapsee Pannu | ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాంధారి’ (Gandhari). ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 3 నుంచి నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ చిత్రంలో తాప్సీ అంధురాలైన తల్లి పాత్రలో నటిస్తోంది. కిడ్నాప్‌నకు గురైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ఒక తల్లి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంది, చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై ఎలా పోరాటం సాగించింది అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఇష్వాక్ సింగ్ గోకుల్ పాత్రలో, జతిన్ సర్నా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు స్వస్తిక ముఖర్జీ, మితా వశిష్ట్, ఛాయా కదం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవాశిష్ మఖీజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కనిక ధిల్లాన్ కథను అందించి ‘కథా పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.