యశోద జీవన చిత్రం
సమంత కథానాయికగా నటిస్తున్న తా జా చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
సమంత కథానాయికగా నటిస్తున్న తా జా చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం హృదయాన్ని తడిమే భావోద్వేగాలతో సాగుతుంది. మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఉంటాయి.
యశోద జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన మలుపులు, వాటివెనకున్న వ్యక్తులెవరనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలుగు, తమిళంలో సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పారు. భారీ వ్యయంతో వందరోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం’ అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సం గీతం: మణిశర్మ, సంభాషణలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, దర్శకత్వం: హరి-హరీష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

