System Trailer | న్యాయం కోసం ఇద్దరు మహిళల పోరాటం.. జ్యోతిక, సోనాక్షిల ‘సిస్టమ్’ ట్రైలర్ చూశారా!
System Trailer | వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటి జ్యోతిక, బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా కలిసి నటిస్తున్న తాజా మూవీ 'సిస్టమ్' (System).
System Trailer | వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటి జ్యోతిక, బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా కలిసి నటిస్తున్న తాజా మూవీ ‘సిస్టమ్’ (System). నేరుగా ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో మే 22 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సమాజంలోని రెండు వేర్వేరు ధృవాలకు చెందిన మహిళలు న్యాయం కోసం ఏకమైతే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేహా రాజవంశ్ (సోనాక్షీ సిన్హా) వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే ధైర్యవంతురాలైన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కనిపించనుంది. సారిక (జ్యోతిక) సామాన్య జీవితం గడిపే ఓ స్టెనోగ్రాఫర్‌గా, తనదైన శైలిలో న్యాయం కోసం పోరాడే పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేశారు. అన్యాయంపై ఆశయం సాధించిన విజయమే ఈ ‘సిస్టమ్’. అధికారం, వ్యవస్థలోని లోతుపాతుల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్, గౌరవ్ పాండే కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అశ్వినీ అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 22న స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, ఓటీటీ ప్రియులకు ఒక సరికొత్త క్రైమ్ డ్రామా అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

