Swara bhasker: పాత ఇంట్లోకి కొత్తగా గృహ ప్రవేశం.. షాక్ అవుతున్న హీరోయిన్ ఫ్యాన్స్

ఈ మధ్య హీరోలతో పోటీగా హీరోయిన్స్ కూడా అందాల మేడలు కడుతున్నారు. కుర్ర భామలు సైతం ముంబైలోని కాస్ట్లీ ఏరియాలలో ఖరీదైన బంగ్లాలు కట్టి ఆశ్చర్యపరుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ స్వర భాస్కర్ గృహ ప్రవేశం చేయగా, అందరు ఆనందించాల్సింది పోయి ఆశ్చర్యపోతున్నారు.
పాత ఇంట్లోకి కొత్తగా గృహ ప్రవేశం చేయడమే వారి ఆశ్చర్యానికి కారణం. అసలు విషయం ఏంటంటే రెండున్నర సంవత్సరాల తరువాత గత నెలలో స్వరా తను పునర్నిర్మించిన( రినోవేటెడ్) పాత ఇంటిలోకి మారారు. కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా వినాయక పూజచేశారు. గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న ఫోటోలను స్వరా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ‘దేవుళ్లు ఆమోదించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి.
సాధారణంగా స్వర భాస్కర్ నెటిజన్స్ మనోభావాలు దెబ్బ తీనేలా పోస్ట్‌లు ఎక్కువగా పెడుతుంటుంది. కాని ఆమె భక్తి భావనలో మునిగినట్టు ఫోటోలు పెట్టడం చూసి ప్రతి ఒక్కరు షాకవుతున్నారు. తాను షేర్ చేసిన ఫోటోలలో స్వరా చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- netigens
- Swara Bhasker
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

