Hema | బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమపై సస్పెన్షన్ ఎత్తివేత
బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
Hema | బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ వ్యవహారంలో అక్కడి పోలీసులు హేమను అరెస్ట్ చేశారు. అనంతరం ‘మా’ ఆమెపై సస్పెన్షన్ విధించింది.
అయితే ఇటీవల విడుదల చేసిన వీడియోలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు హేమ తెలిపింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ‘మా’తనకు అండగా నిలవాలని ఆమె అభ్యర్థించింది. ఈ విషయాలతో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాయడంతో పాటు మెడికల్ సర్టిఫికెట్లను కూడా అందజేసింది. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ హేమపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

