ప్రేమబంధానికి ముగింపు

మూడేళ్ల ప్రేమాయణానికి వీడ్కోలు పలికింది బాలీవుడ్ నటి సుస్మితాసేన్. ప్రియుడు రోహ్మన్ శావల్తో తన అనుబంధం ముగిసినట్లుగా ఆమె ప్రకటించింది. రోహ్మన్తో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సుస్మితాసేన్ ‘స్నేహితులుగా మా అందమైన ప్రయాణం మొదలైంది. ఇకపై స్నేహితులుగానే కొనసాగుతాం. ఎన్నో మధురానుభూతులను మిగ్చిలిన మా సుదీర్ఘప్రణయబంధానికి ముగింపు పలుకుతున్నాం’ అని పేర్కొన్నది. నో మోర్ స్పెక్యులేషన్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. రోహ్మన్తో విడిపోవడానికి గల కారణాల్ని మాత్రం సుస్మితాసేన్ వెల్లడించలేదు. తనకన్నా వయసులో పదిహేనేళ్లు చిన్నవాడైన రోహ్మన్తో సుస్మితకు 2018లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుస్మిత సినిమా ప్రచార కార్యక్రమాలతో పాటు కుటుంబ వేడుకల్లో రోహ్మన్ చాలా సార్లు కనిపించారు. మనస్పర్థలతోనే వీరు విడిపోయినట్లుగా సమాచారం. ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌లో గృహిణిగా జీవితాన్ని మొదలుపెట్టి మాఫియాడాన్‌గా మారిన మహిళగా సుస్మితాసేన్ నటనకు మంచి పేరు వచ్చింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rohman Shawl
- Sushmita Sen
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

