సూర్య, బాల సినిమా టైటిల్ ఏంటో తెలుసా..?
ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి జోడి హీరో సూర్య.. దర్శకుడు బాల. ఈ ఇద్దరికీ ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కొన్నేళ్లుగా బాల తన స్థాయి సినిమాలు చేయడం లేదు. అలాగే సూర్య ఓటిటిలో అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు.. కానీ థియేటర్ వరకు వచ్చేసరికి కమర్షియల్ కథలను నమ్ముకొని అడ్డంగా మునిగిపోతున్నాడు. ఇలాంటి సమయంలో ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది.
తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికి.. ఇప్పుడు లైఫ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు సూర్య. కెరీర్ మొదట్లో సూర్యతో ఈయన పితామగన్ సినిమా చేశాడు. అందులో విక్రమ్ హీరో అయినా కూడా.. సూర్య పాత్రకు మంచి పేరు వచ్చింది. మరీ ముఖ్యంగా తమిళంలో సూర్య అనే ఒక నటుడు వచ్చాడు అని దర్శకులకు తెలిసేలా చేసిన సినిమా పితామగన్. ఇదే సినిమా తెలుగులో శివపుత్రుడుగా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన అక్రోషం కూడా మంచి విజయం సాధించింది. మధ్యలో వాడు వీడు సినిమాలో సూర్య అతిధి పాత్రలో నటించాడు.
దాదాపు 16 సంవత్సరాల తర్వాత సూర్య, బాల కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఇది కూడా తన తరహాలోనే తెరకెక్కిస్తున్నాడు బాల. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి తమిళంలో వనంగాన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అచలుడు అంటూ వస్తున్నాడు సూర్య. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే మరో ప్రయోగాత్మక చిత్రమే అని అర్థమవుతుంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న బాల.. సూర్య సినిమాతో తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు సూర్యకు కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకం. మరి ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం వస్తుందా లేదా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- achaludu
- Bala
- surya
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

