Suriya’s Karuppu | తమిళనాడులో మళ్లీ స్పెషల్ షోల జోరు.. సీఎం విజయ్‌కు థాంక్స్ చెప్పిన సూర్య ‘కరుప్పు’ టీమ్
TN CM Vijay | తమిళనాడులో స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కరుప్పు' విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద మళ్లీ పండగ వాతావరణం నెలకొనబోతోంది.
TN CM Vijay | తమిళనాడులో స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద మళ్లీ పండగ వాతావరణం నెలకొనబోతోంది. గత స్టాలిన్ ప్రభుత్వంలో శాంతిభద్రతల కారణాంగా నిలిపివేసిన ఉదయం 9 గంటల షోలను (9 AM Shows) కొత్త ప్రభుత్వం మళ్లీ ప్రారంభించబోతుంది. సుర్య నటించిన తాజా చిత్రం కరుప్పు ఈ గురువారం (మే 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఈ సినిమా 9 గంటల షో కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి కోరింది.
అయితే ఈ కరుప్పు టీమ్ అభ్యర్థనకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ వెసులుబాటు కల్పించినందుకు చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ముఖ్యమంత్రి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పేరుతో మే 14న విడుదల కానుంది. గతంలో అజిత్ ‘తుణివు’, విజయ్ ‘వారిసు’ సినిమాల సమయంలో తలెత్తిన సమస్యల వల్ల ఎర్లీ మార్నింగ్ షోలపై ఆంక్షలు విధించగా, ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి హోదాలో పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒక ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఈ ప్రత్యేక షోల అనుమతితో అంచనాలు మరింత పెరిగాయి.
Special thanks to our honorable Chief Minister Thiru. Joseph Vijay for granting the special permission for the 9AM shows of #Karuppu.#Karuppu – FDFS begins at 9AM, from May 14th🔥
A @SaiAbhyankkar Musical 🎵@Suriya_offl @trishtrashers @RJ_Balaji @dop_gkvishnu @prabhu_sr… pic.twitter.com/6sLumAcAFr
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

