Suriya | కామాఖ్యా దేవి ఆలయంలో సూర్య-జ్యోతిక ప్రత్యేక పూజలు.. వైరల్ అవుతున్న స్టార్ కపుల్ ఫోటోలు
Suriya | కోలీవుడ్లో అత్యంత అభిమానాన్ని సంపాదించిన జంటల్లో సూర్య–జ్యోతిక జంటకు ప్రత్యేక స్థానం ఉంది. తెరపై తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ను సమతూకంగా కొనసాగిస్తూ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Suriya | కోలీవుడ్లో అత్యంత అభిమానాన్ని సంపాదించిన జంటల్లో సూర్య–జ్యోతిక జంటకు ప్రత్యేక స్థానం ఉంది. తెరపై తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ను సమతూకంగా కొనసాగిస్తూ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ కెరీర్ పరంగా కూడా మంచి జోష్లో ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోగా, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘సిస్టం’ సినిమా కూడా మంచి స్పందనను అందుకుంది. వరుస విజయాలతో ఫుల్ హ్యాపీగా ఉన్న ఈ జంట తాజాగా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు.
దీనిలో భాగంగా సూర్య, జ్యోతిక కలిసి అస్సాంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామాఖ్యా దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అక్కడ కొన్ని ప్రత్యేక ఫోటోలకు పోజులిచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో సూర్య, జ్యోతిక ఎంతో సింపుల్గా, ప్రశాంతంగా కనిపించారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
“ఎవర్గ్రీన్ జంట”, “సక్సెస్ తర్వాత దైవ దర్శనం చాలా మంచి విషయం”, “ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు”, “ఇదే నిజమైన పవర్ కపుల్” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, సూర్య ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, జ్యోతిక కూడా పలు కీలక కథలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు సినీ ప్రయాణం, మరోవైపు కుటుంబ జీవితం రెండింటినీ సమతూకంగా కొనసాగిస్తున్న ఈ స్టార్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

